Pawan Kalyan: వారిని నేను వదులుకోడానికి సిద్ధం: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో

Update: 2024-07-15 10:24 GMT

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే.. వారిని తాను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటానన్నారు. ప్రతి రోజూ ఒక ప్రజా ప్రతినిధి అయినా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. అంతేకాకుండా.. అధికారంలోకి వచ్చినందుకు అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. రౌడీయిజాన్ని అసలు నమ్మొద్దని, దురుసుగా మాట్లాడ్డం, బెదిరింపు ధోరణితో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు.

మహిళా నేతలను ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. సంస్కరించాల్సిన మనమే.. తప్పులు చేయకూడదన్నారు. కేంద్రంలోకి రావాలని మంత్రి పదవి ఇస్తామని ప్రధాని మోదీ అన్నారని.. అయితే తాను మాత్రం రాష్ట్రంలోనే ఉంటానని చెప్పానన్నారు. అడగాల్సిన టైంలో రాష్ట్రం కోసం ప్రధానిని అడుగుతానన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, రైల్వే జోన్, 20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలను అడుగుతామన్నారు. ఎక్కడైనా మోదీని కలిస్తే 60 సెకన్ల కంటే ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడనని, ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని, అలాంటి వ్యక్తి సమయం వృథా చేయకూడదన్నారు.


Tags:    

Similar News