అనారోగ్యం బారిన పడిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. వారాహి విజయ యాత్రలో భాగంగా అవిశ్రాంతంగా పర్యటనలు చేస్తుండడం

Update: 2023-06-27 07:35 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. వారాహి విజయ యాత్రలో భాగంగా అవిశ్రాంతంగా పర్యటనలు చేస్తుండడం, దీనికి తోడు ఉపవాస దీక్ష పాటిస్తుండడంతో పవన్‌ ఇబ్బంది పడుతున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావారి జిల్లా పెద అమిరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో జూన్ 27 ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాతే ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు స్వల్ప ఇబ్బంది మాత్రమే ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇటీవల వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ వెంటనే వారాహి విజయ యాత్ర చేపట్టారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు భీమవరంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో పవన్ సమావేశాన్ని నిర్వహించి, మార్గనిర్దేశం చేయబోతున్నారు. నర్సాపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయ పోరాటంలో తన ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియదన్నారు. పులివెందుల నుంచి కొందరు నర్సాపురం ఆక్వా వ్యాపారాల్లో జోక్యం చేసుకుంటున్నారని పవన్ అన్నారు. అవినీతి, దోపిడీయే లక్ష్యంగా కొందరు నేతలు పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎవరో ఒకరు మొదలు పెట్టకపోతే సమాజంలో మార్పురాదని అన్నారు.


Tags:    

Similar News