Pawan Kalyan : పవన్ మదనపడుతున్నారా? అసంతృప్తితో సతమతమవుతున్నారా?

అధికారంలోకి రాకముందు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత స్లో అయినట్లే కనిపిస్తుం;

Update: 2025-03-12 06:38 GMT
pawan kalyan, deputy chief minister,  slowed down, ap politics
  • whatsapp icon

అధికారంలోకి రాకముందు రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత స్లో అయినట్లే కనిపిస్తుంది. పాలనపై దృష్టి పెట్టడంతోనే రాజకీయాలకు, విమర్శలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ ఆయనలో తెలియని అసంతృప్తి ఏదో ఉందని పవన్ కల్యాణ్ ను దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్నారు. తాము ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో అది నెరవేర్చలేకపోతున్నామన్న బాధ ఆయనలో కనిపిస్తుందంటున్నారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టినా ప్రజలు పట్టించుకోరు. జగన్ చేసిన అప్పుల వల్లనే తాము సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని చెప్పినా రాజధాని అమరావతికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని జనం ప్రశ్నించే అవకాశముందని ఆయన మౌనంగానే ఉంటున్నట్లు తెలిసింది.

సభలు, రోడ్ షోలలో...
ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుతో కలసి అనేక బహిరంగ సభలు, రోడ్ షోలలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను యాజ్ ఇట్ ఈజ్ గా పవన్ కల్యాణ్ కూడా జనం ముందుంచారు. చంద్రబాబు మాటలపై నమ్మకం లేకపోయినా ఒక వర్గం ప్రజలు మాత్రం పవన్ కల్యాణ్ పై ఆశలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి వస్తే మాట తప్పరని భావించి కలసి కట్టుగా ఉండి కూటమి పార్టీల విజయానికి తోడ్పడ్డారు. ఇక కూటమి విడుదల చేసిన మ్యానిఫేస్టో లో కూడా పవన్ భాగస్వామ్యం ఉండటంతో ఆయన మరింత చిరాకు పడుతున్నట్లు తెలిసింది. మ్యానిఫేస్టో విడుదల కార్యక్రమంలో పవన్ తో పాటు నాగబాబు కూడా పాల్గొన్నారు.
పవన్ పై నమ్మకంతో...
ఇక్కడ బీజేపీ తెలివిగా వ్యవహరించింది. మ్యానిఫేస్టో విడుదల కార్యక్రమంలో ఉన్నా దానికి తాము దూరమన్నట్లు వ్యవహరించింది. కానీ పవన్ కల్యాణ్ పరిస్థితి అలాకాదు. చంద్రబాబుకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తారని భావించారు. అందుకే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ కల్యాణ్ కూడా పాలుపంచుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని చెప్పి హామీల అమలులో ఆలస్యం పవన్ కల్యాణ్ కు కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు. తాను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయేనే అన్న భాధ ఆయనలో కనిపిస్తుందని జనసేన ముఖ్యనేత ఒకరు తెలిపారు.
బాబు ప్రాధాన్యతలు...
అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ ది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చంద్రబాబు ప్రధమ ప్రాధాన్యం అమరావతి, పోలవరం కావడంతో తాను ఎప్పుడు కలసినా విడతల వారీగా హామీలను అమలుచేద్దామని పవన్ కల్యాణ్ వద్ద చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ కూడా మిగిలిన రాజకీయ నేతల్లాగా మారిపోయారని ప్రజలు భావించే అవకాశముందని పవన్ కల్యాణ్ మదనపడుతున్నారని చెబుతున్నారు. అందుకే వీలయినంత త్వరగా ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంలో పవన్ కల్యాణ్ ఉన్నారు. కానీ నిధులు సహకరించకపోవడంతో ఆయన బాధ పడటం మినహా చేసేదేమీ లేదన్న కామెంట్స్ గాజు గ్లాస్ పార్టీ నుంచి వినపడుతున్నాయి


Tags:    

Similar News