అన్న ప్రసాద ట్రస్ట్ కు అన్నా లెజినోవా 17 లక్షల విరాళం
తిరుమలలో శ్రీవారిని పవన్ కల్యాణ్ సతీమణి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేశారు.;

తిరుమలలో శ్రీవారిని పవన్ కల్యాణ్ సతీమణి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాల అనంతరం అన్నా లెజినోవా తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయట పడటంతో తిరుమలకు వచ్చి తలనీలాలను సమర్పించి మొక్కులుచెల్లించుకున్నారు. ఈరోజు ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం అన్నా లెజినోవా అన్నదానం సత్రానికి వెళ్లారు.
అన్న ప్రసాదాలను స్వీకరించి...
తన కుమారుడు మార్క్ శంకర్ పేరిట తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దాన సత్రానికి పదిహేడు లక్షల విరాళాన్ని అన్నాలెజినోవా అందించారు. అన్నదానం సత్రంలో భక్తులకు స్వయంగా తీర్థప్రసాదాలను వడ్డించారు. ఒకపూట అయ్యే ఖర్చు విరాళం పదిహేడు లక్షలను విరాళంగా ఇచ్చిన అన్నాలెజినోవా అక్కడే అన్న ప్రసాదాలను స్వీకరించారు.