YSRCP: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి

Update: 2024-09-14 03:25 GMT

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలను అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమించారు. తిరుపతి జిల్లా వైస్సార్‌సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు

చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా కాలంగా 'పెద్దాయన' అని పిలుస్తారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డికి ఇచ్చే బాధ్యతల గురించి చర్చ జరిగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలను మాత్రమే వైఎస్సార్‌సీపీ గెలుచుకోగలిగింది.


Tags:    

Similar News