జయసుధకు న్యాయస్థానంలో ఊరట
పేర్నినాని సతీమణి జయసుధకు ఊరట లభించింది. పేర్ని నాని జయసుధ కు మచిలీపపట్నంలో న్యాయస్థానం ముందస్తు బెయల్ మంజూరు చేసింది;

మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు ఊరట లభించింది. పేర్ని నాని జయసుధ కు మచిలీపపట్నంలో న్యాయస్థానం ముందస్తు బెయల్ మంజూరు చేసింది. ఈమేరకు హైకోర్టు తీర్పు చెప్పింది. పేర్ని నాని జయసుధ ముందస్తు పై నేడు న్యాయస్థానంలో విచారణ జరిగింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ2 నిందితురాలగా పేర్ని జయసుధ ఉన్నారు.

విచారణకు హాజరు కావాలంటూ...
ఆమె తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నం లో పేర్ని నానికి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమవ్వడంపై ఆమెపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించిన దాదాపు 1.37 కోట్ల రూపాయలను పేర్ని జయసుధ ప్రభుత్వానికి చెల్లించారు. కానీ న్యాయస్థానం మందస్తుబెయిల్ మంజూరు చేస్తూనే విచారణకు సహకరించాలని ఆదేశించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now