sani Krishna Murali : బోరుమని విలపించిన పోసాని
నీనటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు;

సినీనటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తనపై వ్యక్తిగత కోపంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేసి తిప్పుతున్నారని, తన ఆరోగ్యం సహకరించడం లేదని, రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకుంటే తనకు ఆత్మహత్య శరణ్యమని పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు.
బెయిల్ ఇవ్వకుంటే...
నిజంగా తప్పు చేస్తే శిక్షించాలని, కానీ తనపై ఎన్ని కేసులు పెట్టారో తనకే తెలియదన్న ఆయన తన పరిస్థితిని చూసి తనను వదలేయాలని కోరుతున్నానని పోసాని కృష్ణమురళి కోరుకున్నారు. తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని ఆయన విలపించారు. తన భార్య, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని పోసాని కృష్ణమురళి అన్నారు.