నక్కా ఆనంద్, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

వారిద్దరినీ పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఆనంద్ బాబు, ధూళిపాళ్ల నరేంద్రల..;

Update: 2022-12-17 07:24 GMT
Dhulipalla narendra and nakka anand babu arrest

Dhulipalla narendra and nakka anand babu arrest

  • whatsapp icon

మాచర్ల అల్లర్ల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో మాచర్ల కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు మాచర్లకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇళ్లనుండి బయటికి రాకుండా గస్తీ కాస్తున్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రలను నర్సరావుపేటకు రాకుండా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

వారిద్దరినీ పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఆనంద్ బాబు, ధూళిపాళ్ల నరేంద్రల అరెస్టుల నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు- టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు టీడీపీ నేతలను మాచర్లలోకి రాకుండా మాచర్లలో భారీగా పోలీసులు మోహరించారు. కోడెల శివరామ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మరోవైపు పల్నాడు ఎస్పీ.. ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. కొద్దిరోజులపాటు మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, బయటివ్యక్తులు రావొద్దని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు.


Tags:    

Similar News