రాజమహేంద్రవరం- 2 కోట్లకు పైగా క్యాష్.. సెల్ ఫోన్ ట్రాక్

రాజమహేంద్రవరం పోలీసులు భారీ చోరీ కేసును

Update: 2024-07-27 10:29 GMT

రాజమహేంద్రవరం పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. బ్యాంకుకు చెందిన 2.2 కోట్లకు పైగా డబ్బులను కొట్టేశాడో వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం దొంగతనం ఘటన జరిగిన కొద్దిగంటల్లోనే నిందితుడిని వాసంశెట్టి అశోక్ కుమార్ (27) అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను పోలీసు సూపరింటెండెంట్ నర్సింహ కిషోర్ మీడియాకు వెల్లడించారు. ఏటీఎంలలో నగదు నింపే బాధ్యతను నిర్వహించే ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన తాత్కాలిక ఉద్యోగి అశోక్‌ పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు ఏటీఎంలలో నగదు నిల్వలు ఉంటాయని గుర్తించి, తదనుగుణంగా తన ప్రణాళికను అమలు చేశాడు. మూడేళ్లుగా హిటాచి మేనేజ్ మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్‌గా అశోక్ పని చేస్తున్నారు. మొత్తం 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా ఘటన జరిగింది.

ఘటన జరిగిన రోజున ఏజెన్సీ దానవాయిపేటలోని హెచ్‌ఎఫ్‌సి బ్రాంచ్‌లో రూ.2,20,50,000 నుండి తీసుకోగా.. అశోక్ నగదును ఇనుప పెట్టెలో పెట్టి ప్రైవేట్ వాహనంలో తీసుకుని వెళ్ళాడు. చోరీ సమయంలో అతడు బ్యాంకు సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది దృష్టిని తప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. దొంగతనం ఫిర్యాదును స్వీకరించిన వెంటనే, అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. కొన్ని గంటల్లోనే కేసును వేగంగా పరిష్కరించారు. అశోక్ సెల్ ఫోన్ ట్రాకింగ్ సహా పటిష్టమైన సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు చేశారు. నిందితుడు విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడ్డాడని, దీంతో దొంగతనానికి పథకం పన్నాడని ఎస్పీ కిషోర్‌ వివరించారు.


Tags:    

Similar News