విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు.

Update: 2022-01-25 05:59 GMT

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఈ నెల 26వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొంటారు. దీంతో రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ రూట్లోకి అనుమతించరు....
విజయవాడ వాసులు ట్రాఫిక్ ఆంక్షలను తెలుసుకుని ప్రయాణించాలని పోలీసులు కోరారు. బెంజి సర్కిల్ వైపు నంచి మహాత్మాగాంధీ రోడ్డు వైపు వచ్చే వాహనాలను బెంజిసర్కిల్, న్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా మళ్లిస్తారు. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టఏ సెంటర్, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ సెంటర్ వైపు ఏవిధమైన వాహనాలను ఈ సమయంలో అనుమతించారు. బెంజి సర్కి్ల నుంచి డీసీపీ బంగ్లా వరకూ వీఐపీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పాత కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వైపు వచ్చే అన్ని వాహనాలను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు.


Tags:    

Similar News