మాచర్ల ఘటనపై పోలీసుల వార్నింగ్

మాచర్ల ఘటనపై సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేేసే వారిపై పోలీసులు నిఘా ఉంచారు;

Update: 2022-12-17 03:12 GMT
macherla, high tension,  police, alert, YCP and TDP , fights, andhrapradesh
  • whatsapp icon

మాచర్ల ఘటనపై సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేేసే వారిపై పోలీసులు నిఘా ఉంచారు. మాచర్లలో ప్రస్తుతం పరిస్థిితి అదుపులో ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని మాచర్ల పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

సోషల్ మీడియాలో...
రెండు పార్టీలకు చెందిన ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేతలు ఉద్దేశ్యపూర్వకంగా పరస్పరం దాడులు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. రాళ్లురువ్వుకున్నారని, ఈ దాడిలో కొందరు గాయపడ్డారని చెప్పారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం మాచర్లలో 144వ సెక్షన్ విధించామని, ఎవరూ అపోహలు సృష్టించవద్దని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాచర్లకు ఎవరూ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు రావడానికి వీల్లేదని చెబుతున్నారు.


Tags:    

Similar News