ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే
ఏపీలో విద్యుత్తు సమస్య తీవ్రమయింది. ఇప్పటికే విద్యుత్తు కోతలను విధిస్తున్న ప్రభుత్వం పరిశ్రమలపై ఆంక్షలను పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు సమస్య తీవ్రమయింది. ఇప్పటికే విద్యుత్తు కోతలను విధిస్తున్న ప్రభుత్వం పరిశ్రమలపై ఆంక్షలను పెట్టింది. ఎండలు పెరిగి పోవడంతో విద్యుత్తు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. అలాగే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కేవలం యాభై శాతం విద్యుత్తును మాత్రమే వాడుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
విద్యుత్ డిమాండ్ పెరగడంతో....
పరిశ్రమలకు వీక్లీ హాలిడే కు తోడుగా మరో రోజు పవర్ హాలిడేను ప్రకటించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పవర్ హాలిడే అమలులో ఉండనుంది. అలాగే రెండు వారాల పాటు విద్యుత్ కోతలు అమలులో ఉండనున్నాయి. విద్యుత్తు కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఎస్సీడీసీఎల్ సీఎండీ హరనాధరావు తెలిపారు.