తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. తిరుపతికి చేరుకుంటారు. ఉదయం 11.35 గంటలకు అలిపిరిలోని గో మందిరాన్ని..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండవరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. తొలిరోజు విజయవాడ, విశాఖపట్నంలలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి.. నేడు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందు వరాహ దర్శనం చేసుకున్న అనంతరం మహాద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రాష్ట్రపతి తిరిగి అతిథి గృహానికి చేరుకున్నారు.
అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. తిరుపతికి చేరుకుంటారు. ఉదయం 11.35 గంటలకు అలిపిరిలోని గో మందిరాన్ని సందర్శిస్తారు. 11 55 గంటలకు శ్రీ పద్మావతి యూనివర్శిటీలోని విద్యార్థినులతో ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.20గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 1.40గంటలకు తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు.