Amaravathi : అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్.. టెండర్లకు నోటిఫికేషన్

అమరావతి నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది

Update: 2024-12-31 03:49 GMT

అమరావతి నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ల్యాండ్ పూలింగ్ భూముల్లో మౌలిక వసతులను కల్పించేందుకు, ఇతర పనులకు సంబంధించిన టెండర్లను సీఆర్డీఏ అధికారులు ఆహ్వానించారు. ప్రపంచబ్యాంకు ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం నిధులు విడుదలకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.



పనులకు సంబంధించి...
టెండర్లలో పనులు చేపట్టనున్న కంపెనీలు తమ ధరలను కోట్ చేయాల్సి ఉంది. అయితే దీనిని వచ్చే నెల రెండో వారంలో ఖరారు చేయనున్నారు. వెంటనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల నిర్మాణంతో పాటు వివిధ రకాల మౌలిక సదుపాయల కల్పనకు ఈ టెండర్లను సీఆర్డీఏ ఆహ్వానించింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News