పోరాటాలతో విశాఖ ఉక్కును రక్షించుకుందాం

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1000 రోజులకు

Update: 2023-11-08 14:37 GMT

32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమని గాజువాక నియోజక వర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1000 రోజులకు చేరుకున్నాయి. పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, సి.హెచ్.నర్శింగరావు 1000 రోజుల నిరసన దీక్షా శిబిరానికి అధ్యక్షత వహించగా, ఈ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్స్ సంఘీభావం తెలిపారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు, రాష్ట్రం లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్ లకు చెందిన నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో సముద్ర తీరంలోని ఏకైక కర్మాగారం విశాఖ ఉక్కు అని అన్నారు. ఈ కర్మాగారం ప్రాణ త్యాగాలతో ఏర్పాటైనదని , ఇలాంటి కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం తన అనునాయకులకు కట్టబెడితే ఊరుకోబోమని అన్నారు.

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ. పాల్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపదని, ఈ సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మే హక్కు లేదన్నారు. గాజువాక మాజీ శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఆసియా ఖండం లోనే నాణ్యతాపరంగా అత్యున్నత కర్మాగారమన్నారు. మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ కర్మాగారం అని, ఈ కర్మాగారం వేలాది మందికి ఉపాధినిచ్చిందని అన్నారు. శాసన మండలి సభ్యులు పాకాలపాటి రఘవర్మ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉపాధి ఇచ్చిన కర్మాగారం అని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురించైనా విశాఖ ఉక్కు కర్మాగారంను కాపాడుకుంటామని అన్నారు. 1000రోజుల నిరసన దీక్షల్లో కార్మిక సంఘాల నాయకులు కె.ఎస్.ఎన్.రావు, కారు రమణ, జె.అయోధ్య రామ్, వై.టి.దాస్, జె.రామకృష్ణ, బొడ్డు పైడిరాజు, విల్లా రామ్మోహన్ కుమార్, గణపతి రెడ్డి, వరసాల శ్రీనివాసరావు, సి.హెచ్.సన్యాసిరావు, యు.రామస్వామి, తాడికొండ జగదీశ్, కె.పరంధామయ్య, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎ.మసేను రావు, గుమ్మడి నరేంద్ర, డి.శ్రీనివాస్, జి.ఆనంద్, సీనియర్ పాత్రికేయులు, కార్మిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.


Tags:    

Similar News