YSRCP RajyaSabha: హమ్మయ్య.. వారిద్దరూ చెప్పేశారు

వైఎస్సార్సీపీలో తమ భవిష్యత్ ప్రణాళికలపై ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-08-30 09:58 GMT

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. దీంతో పలువురు నేతలు కూడా రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య తాజా పరిణామాలపై స్పందించారు. పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని, వాళ్ల మాదిరి తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. జగన్ తనను గౌరవించారని అందుకే తొలి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నానన్నారు. బీసీల కోసం కొట్లాడమనే ఆయన తనను రాజ్యసభకు పంపించారని చెప్పారు.

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారాన్ని ఖండించారు సుభాష్ చంద్రబోస్. తాను నైతిక విలువలు కలిగిన వ్యక్తినని, వైసీపీని వీడి తాను వెన్నుపోటు పొడవలేనని అన్నారు. తాను జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని, తప్పుడు వార్తలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని కోరారు.


Tags:    

Similar News