19 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Update: 2023-07-04 02:37 GMT

నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, యాదాద్రి, వనపర్తి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మంగళవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తతో ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.


Tags:    

Similar News