రాజంపేట ఎమ్మెల్యేపై కరపత్రాలు

100 సంవత్సరాల రెవెన్యూ డివిజన్ కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా చేసింది ఎవరు? స్వార్థ ప్రయోజనాల కోసం జరిగిన

Update: 2023-05-29 08:14 GMT

రాజంపేటలో కరపత్రాలు కలకలం సృష్టించాయి. శని, ఆదివారాలలో నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేసిన కరపత్రాలు కలకలం రేపాయి. 13 అంశాలతో వేసిన ఈ కరపత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 100 సంవత్సరాల రెవెన్యూ డివిజన్ కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా చేసింది ఎవరు? స్వార్థ ప్రయోజనాల కోసం జరిగిన వినాశనం నుంచి బయటపడేందుకు అభివృద్ధి నిధులకు అడ్డుపడుతున్నది ఎవరు? అంటూ పలు అంశాలను ప్రస్తావిస్తూ కరపత్రాలను ప్రజలలోకి వదిలారు. ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండి రాజంపేటకు ఎలాంటివో మంచి పని చేయలేదని అందులో ప్రస్తావించారు. శని, ఆది వారాలలో రాజంపేట నియోజకవర్గంలో నందలూరు, సుండుపల్లె మండలాల్లో ఈ కరపత్రాలు గుర్తు తెలియని వ్యక్తులు పంపిణీ చేశారు. హోటళ్లు, దుకాణాలు ఉండే ప్రాంతాలలో ఈ కరపత్రాలను రాత్రిపూట పడేసి వెళ్లారు.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి లక్ష్యంగానే ఈ కరపత్రాలు వేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. కరపత్రంలో పేర్కొన్న కొన్ని అంశాలు పరోక్ష్యంగా ఎమ్మెల్యేను ఉద్దేశించే ఉన్నట్లు తెలుస్తోంది. మేడాకు వ్యతిరేకంగా వీటిని వేశారని పలువురు పేర్కొంటున్నారు. గత నెలలో ఎమ్మెల్యే మేడాకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం సంచలనం కలిగించింది. ఇప్పుడు ఏకంగా కరపత్రాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. మేడాను పార్టీలో నుంచి బయటకు పంపేందుకు ఈ ప్లాన్ వేశారని అంటున్నారు. అధికారపార్టీలోని వర్గ పోరు కారణంగానే రాబోయే ఎన్నికల్లో మేడాకు టికెట్ దక్కకుండా చేసేందుకు కొందరు ఈ ఎత్తుగడలు వేస్తున్నట్లు రూమర్లు కూడా ఈ మధ్య ఎక్కువయ్యాయి.


Tags:    

Similar News