Mopidevi : జగన్ నిర్ణయమే నాకు శిరోధార్యం
రేపల్లె నియోజకవర్గానికి నూతన వైసీపీ ఇన్‌ఛార్జిని నియమించడాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్వాగతించారు;

mopidevi venkataramana
రేపల్లె నియోజకవర్గానికి నూతన వైసీపీ ఇన్‌ఛార్జిని నియమించడాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ స్వాగతించారు. తాను ఈ విషయంలో ఎలాంటి బాధ చెందడం లేదన్నారు. తన అభిమానులు ఎవరూ కలత చెందవద్దని ఆయన కోరారు. తాను గత ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడు జగన్ తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
ఓటమిపాలయినా...
అంతే కాదు తనకు తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా జగన్ ఇచ్చారని మోపిదేవి వెంకటరమణ అన్నారు. మత్స్యకార సంఘాలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని ఆయన అన్నారు. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. త్వరలోనే తన సామాజికవర్గం పెద్దలతో మాట్లాడతానని మోపిదేవి అన్నారు.