Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో;

Update: 2024-09-11 02:35 GMT
road accident, five members died, one family, adilabad district

 Andhrapradesh

  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో బయలుదేరిన మినీ లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి. చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌ ఈ ప్రమాదంలో చనిపోయారని పోలీసులు తెలిపారు.

జీడిపిక్కల లోడుతో బయలుదేరిన లారీ:
టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లి తిరగబడింది. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నంలో 9 మంది ఉన్నారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ప్ర‌మాదం గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.


Tags:    

Similar News