Free Bus in AP : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై నివేదిక ప్రభుత్వానికి అందించాం.. నిర్ణయం సర్కార్ దే

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు

Update: 2024-01-11 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. అటువంటి ప్రతిపాదన అయితే ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఏమీ రాలేదని ఆయన తెలిపారు. ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అది జరుగుతున్న ప్రచారంగా ద్వారకా తిరుమలరావు కొట్టి పారేశారు. అయితే తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుందన్న దానిపై నివేదిక ఇచ్చినట్లు మాత్రం ఆయన అంగీకరించారు.

పది శాతం రాయితీ...
ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న ఆయన సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు. రాను, పోను ముందుగా రిజర్వ్ చేసుకుంటే పది శాతం రాయితీ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. నాలుగు నెలల్లో మరో 1600 కొత్త లగ్జరీ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తుందని ద్వారకాతిరుమల రావు చెప్పారు. నిన్నటి నుంచి పికప్ లాజి్టిక్ సేవలను, డోర్ డెలవరీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. దీనిని పైలెట్ ప్రాజెక్టుగానే ప్రారంభించామని ద్వారకాతిరుమలరావు త్వరలో దీనిని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.


Tags:    

Similar News