హైదరాబాద్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో 20 శాతం డిస్కౌంట్

జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్లే వారికి తగ్గించిన ఛార్జులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే ..

Update: 2022-01-26 11:50 GMT

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రైవేటు ట్రావెల్స్ మాదిరి ఆఫర్లను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కృష్ణాజిల్లా - హైదరాబాద్ మధ్య రాకపోకల కోసం ప్రయాణికుల ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. కృష్ణాజిల్లాకు చెందిన అన్ని రకాల ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గనున్నాయి. ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీలను 20 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

ఆదివారం మినహా.. మిగతా రోజుల్లో జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్లే వారికి తగ్గించిన ఛార్జులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే శుక్రవారం మినహా.. మిగిలిన రోజుల్లో హైదరాబాద్ నుంచి కృష్ణాజిల్లాకు వచ్చేవారికీ ఈ ఛార్జీలు అమలవుతాయని తెలిపింది ఆర్టీసీ. ఫిబ్రవరి 28వ తేదీ వరకూ.. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోల బస్సుల్లో వెళ్లేవారికి ఈ రాయితీ వర్తిస్తుంది. గుడివాడ నుంచి BHELకు ఇంద్ర బస్సులో చార్జీ రూ.610 నుండి రూ.555కు తగ్గించింది ఆర్టీసీ. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అమరావతి బస్సు చార్జీ రూ.650 నుంచి రూ. 535కి తగ్గించింది. ఇదే రూట్‌లో గరుడ బస్సు చార్జీని రూ.620 నుంచి రూ.495కు తగ్గించింది. వెన్నెల స్లీపర్ బస్సు చార్జీ రూ.730 నుంచి రూ.590కి తగ్గించింది.



Tags:    

Similar News