Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి.;

Update: 2025-01-15 02:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమయిన వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వరకూ సాగనున్నాయి. అందుకోసం భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి వారిని దర్శించుకోవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఎందుకంటే ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భావిస్తారు. అందుకే తిరుమలకు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. అయితే ఎంత మంది వచ్చినా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిందుకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేసినట్లు తెలిపారు.

వైకుంఠ ద్వార దర్శనానికి...
ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 16వ తేదీ కోటా పూర్తయిందని అధికారులు తెలిపారు. 17వ తేదీ కోటా విడుదల చేసిన టీటీడీ అధికారులుతిరుపతిలో విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్లు జారీ చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేశారు. తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరస సెలవులు కూడకా రావడంతో ఎక్కువ మంది వైకుంఠ ద్వార దర్శనాల ద్వారా ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారు మోగిపోతున్నాయి. అలాగే అన్న ప్రసాదం వద్ద, లడ్డూల కౌంటర్ వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంది.
నేడు రద్దీ ఇలా...
మరోవైపు తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం అయినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.ధనుర్మాసం కారణంగా డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వ తేదీ వరకు సుప్రభాత సేవను నిలిపివేసిన టీటీడీ అధికారులు తిరిగి ప్రారంభించారు. నిన్న తిరుమల శ్రీవారిని 78.000 మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 17,406 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ వరకూ ఇదే రకమైన రద్దీ కొనసాగే అవకాశముంది.


Tags:    

Similar News