Tirumala : ఆదివారం .. తిరుమలలో అన్నికంపార్ట్ మెంట్లు నిండిపోయి భక్తులు బారులు తీరి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలలో బారులు తీరారు;

Update: 2025-04-13 03:07 GMT
today darsan time in tirumala,  rush  devotees, sunday
  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలలో బారులు తీరారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఎండ వేడికి తట్టుకునేలా తిరుమల దేవస్థానం అధికారులు అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఫలితాలు విడుదల కావడంతో...
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడంతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. తిరుమల వీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్నాయి. అన్న ప్రసాదం కేంద్రం వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. లడ్డూ తయారీల కేంద్రం వద్ద కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు కోరినన్ని లడ్డూలను అందచేస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఎంబీసీ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,571 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News