Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..ఇంకా ఎంతకాలం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది;
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. ఉత్తర ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీ వరకూ కొనసాగుతుండటంతో నేడు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీవారి సేవలో...
క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ వంటివి అందిస్తున్నారు. వసతి గృహాల వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్నప్రసాదాల క్యాంటిన్ల వద్ద, లడ్డూ కౌంటర్ల వద్ద కూడా రష్ అధికంగా ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారంతా తిరుమలకు చేరుకుని శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
హుండీ ఆదాయం కూడా...
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో హుండీ ఆదాయం కూడా బాగానే ఉంది. ఆర్జిత సేవలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,417 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,396 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి తిరుమల రద్దీ మరింత పెరిగే అవకాశముండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.