Tirumala : భక్తుల రద్దీ సాధారణం... ఎక్కువగా లేకపోవడానికి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సంఖ్య పెద్దగా లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు వారం మధ్యలో భక్తుల సంఖ్య తిరుమలలో తక్కువగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మళ్లీ వీకెండ్ అంటే శని, ఆదివారాలు భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల వచ్చిన తుఫాన్ తో పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
రెండు కంపార్ట్‌మెంట్లలోనే...
నిన్న తిరుమల శ్రీవారిని 63,021 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,091 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.15 కోట్ల రూపాయల వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటలు, సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఎనిమిది గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతుంది.