Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా.. అయితే అలెర్ట్ గా ఉండాల్సిందే

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.;

Update: 2025-03-20 02:56 GMT
darsan time today in tirumala, crowd, devotees, thursday
  • whatsapp icon

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత వారం రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కూడా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రోజుకు నాలుగు కోట్ల రూపాయల వరకూ హుండీ ఆదాయం లభిస్తుంది. భక్తులు అధికసంఖ్యలో వచ్చి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

రద్దీ ఎక్కువ కావడంతో...
మామూలుగా మార్చి నెలలో తిరుమలో రద్దీ తక్కువగా ఉంటుంది. పరీక్షలు ప్రారంభం కావడంతో పాటు వేసవి సెలవులు కూడా లేకపోవడంతో ఇప్పుడు అంత రద్దీ ఏ సంవత్సరం ఉండదు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో స్వామి వారిని ముందుగానే దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు క్యూ కడుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,388 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,145 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News