31 కంపార్ట్‌మెంట్లలలో భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శన సమయం దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది.

Update: 2022-06-22 03:42 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. స్వామి వారి దర్శన సమయం దాదాపు ఎనిమిది గంటలు పడుతుంది. పరీక్ష ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో విడతల వారీగా విడుదల అవుతుండటంతో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అంచనా వేస్తుంది. టీటీడీ అధికారుల అంచనా మేరకు మరో పది రోజుల పాటు ఈ రద్దీ కొనసాగుతుందని చెబుతున్నారు. తమిళనాడు నుంచి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది.

దర్శన సమయం....
నిన్న తిరుమల శ్రీవారిని 74,906 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,138 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చింది. ఈరోజు 31 కంపార్ట్‌మెంట్లలలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News