Bhogi Celebrations : తొలి రోజు ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి పండగ వేడుక ను ఇంటింటా జరుపుకున్నారు

Update: 2024-01-14 02:16 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి పండగ వేడుక ను ఇంటింటా జరుపుకున్నారు. తొలిరోజు భోగి మంటలు వేసుకుని చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఆట పాటలతో సందడి చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి పెరిగింది. తెల్లవారు జామున లేచి భోగి మంటలు వేసి చలి కాచుకున్నారు. ఇంట్లోని పాత సామాన్లను మంటల్లో వేశారు. తెల్లవారు జామునే లేచి ఇంటి ఎదుట భోగి మంటలు వేయడం సంప్రదాయంగా వస్తుంది.

భోగి మంటలలో...
ఈ మేరకు పల్లెల్లో సంక్రాంతి పండగ తొలిరోజు కొట్టొచ్చినట్లు కనపడింి. అనేక మంది సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిడకలను తయారు చేసి వాటితో భోగి మంటలు వేసి పిల్లా పాపా త్వరలో వెళ్లిపోయే చలిని ఈ మంటలలో కాచుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీల నేతలు కూడా భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద పెద్ద మంటలు వేసి తమ పార్టీల తరుపున గ్రామంలో బ్యానర్లు కట్టి మరీ ప్రచారాన్ని మొదలు పెట్టినట్లయింది.


Tags:    

Similar News