ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది

Update: 2024-07-29 03:27 GMT

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాటన్ బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహంతో సోమవారం ఉదయం 6 గంటలకు 15.70 అడుగులకు నీటి మట్టం చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 15 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించారు.

భద్రాచలం వద్ద...
బ్యారేజ్ కింద ఉన్న మూడు పంట కాలువలు ద్వారా 9000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాచలం వద్ద మాత్రం నీటి మట్టం తగ్గుతుంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 45.70 అడుగులకు నీటిమట్టం చేరిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News