ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Update: 2024-09-01 02:17 GMT

ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తిన అధికారులు వరద నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజీ దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అప్రమత్తంగా ఉండాల్సిందే...
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,67,360క్యూసెక్కులుగా ఉంది.నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని తెలిపారు.పడిపోయిన విద్యుత్ లైన్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని అలెర్ట్ చేశారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.


Tags:    

Similar News