Andhra Pradesh : రామ్ గోపాల్ వర్మ కేసు వాయిదా
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా పడింది.;
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా పడింది. హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రామ్ గోపాల్ వర్మ వేసిన పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో రేపు విచారణ జరగనుండటంతో వర్మ ఈరోజు కూడా అదృశ్యంలోనే ఉండనున్నారు. వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వెతుకుతున్నారు.
రెండు రాష్ట్రాల్లో...
ఆయన కోసం హైదరాబాద్, తమిళనాడుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశంజిల్లాతో పాటు రామ్ గోపాల్ వర్మపై విశాఖ, గుంటూరు జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలనినోటీసులు ఇచ్చినా వర్మ హాజరు కాకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయిన నేపథ్యంలో ఆయన కనిపించకుండా పరారీలో ఉన్నారు.