పల్నాడులో డయేరియా.. అదుపులోనే ఉందన్న అధికారులు
పల్నాడు ప్రాంతంలో డయేరియాతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు
పల్నాడు ప్రాంతంలో డయేరియాతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లనే అతి సార వ్యాధి వ్యాప్తి చెందిందని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అన్ని బోర్లు, రక్షిత మంచినీటి వ్యవస్థను నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలు కాచిన వేడి నీటిని మాత్రమే తాగాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
సమీక్షించిన మంత్రి...
పల్నాడులో వ్యాప్తి చెందిన పై నిరంతరం మంత్రి నారాయణ సమీక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దాచేపల్లిలో డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ చెప్పారు. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. స్థానికంగా ఉన్న బోర్లను మూసివేసి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను నగర పంచాయతీ అధికారులు చేస్తున్నారు.