Ys Sharmila : సోదరుడు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన షర్మిల
వైఎస్ జగన్ పై సోదరి షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.;

వైఎస్ జగన్ పై సోదరి షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల అవగాహన ఒప్పందంపై స్వయంగా సంతకం చేసిన జగన్ ఇప్పటి వరకూ ఆస్తి ఇవ్వలేదని అన్నారు. తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇన్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించి జగన్ తల్లిని కూడా మోసం చేశారని మండిపడ్డారు.
తల్లిని మోసం చేసిన కొడుకుగా...
స్వయంగా తల్లిని మోసం చేసిన కొడుకుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్న షర్మిల తల్లిపై కేసు వేసిన కుమారుడిగా, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మామగా ఆయన హిస్టరీలో మిగిలిపోతారని అన్నారు. జగన్ కు ఎంత మేరకు విశ్వసనీయత ఉందో తెలుసుకోవాలని వైసీపీ నేతలకు షర్మిల కోరారు. జగన్ నమ్మదగిన నేత కాదని షర్మిల పేర్కొన్నారు.