Palnadu : కుదుట పడుతున్న మాచర్ల

పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమయ్యారు

Update: 2024-05-16 04:43 GMT

పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. పోలింగ్ అనంతరం మూడు రోజుల పాటు జరిగిన ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రప్పించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ముగ్గురు గుమి కూడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా మాచర్ల ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి దుకాణాలన్నీ మూతబడే ఉన్నాయి.

రెండు వర్గాల మధ్య...
వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి అన్ని పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఘర్షణకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయడంతో కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈరోజు నుంచి మాచర్లలో దుకాణాలు యధాతథంగా తెరుచుకుంటున్నాయి. పల్నాడు జిల్లా ఈరోజు నుంచి కొంత తేరుకుంటుంది.


Tags:    

Similar News