సామాజికవర్గానికి చెందిన...
మంత్రి వాసంశెట్టి సుభాష్ వివాదం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. తన సామాజికవర్గానికి చెందిన పోలీసు ఉన్నతాధికారులను నియమించుకోవడం కూడా వివాదంగా మారింది. ఆ పోలీసు అధికారి కూడా సామాజికవర్గం సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజీ చేశాయి. దీంతో పాటు సొంత పార్టీ నేతలను కూడా ఖాతరు చేయకుండా వైసీపీ వారికి అండగా ఉండటం కూడా వివాదంగా మారింది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను సక్రమంగా చేయకపోవడంతో చంద్రబాబు క్లాస్ పీకారు. అదే సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుకు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ తో కొంత దిగి వచ్చారు. ఇప్పుడు కొంత దారిలో వాసంశెట్టి సుభాష్ పడినట్లు కనిపిస్తుంది.
పోలీసులకు వార్నింగ్ ఇచ్చి...
రాయచోటికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా వివాదంలోకి మారిపోయింది. పోలీసుల అధికారికి మంత్రిగారి భార్య వార్నింగ్ ఇచ్చిన ఘటన కూడా వివాదంగా మారింది. రవాణా శాఖ మంత్రిగా కూడా పెద్దగా పనిచేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. కడప జిల్లాలో ఇంత మంది ఉన్న నేతలున్నా తొలిసారి గెలిచిన వారికి ఇచ్చిన ప్రయారిటీ సీనియర్ నేతలకు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో పాటు పనితీరు కూడా సరిగా లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కేవలం రాయచోటి లో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించారన్నఏకైక కారణంతోనే ఆయనకు మంత్రి పదవి లభించిందన్నది వాస్తవమని ఆ ప్రాంతనేతలే అంటున్నారు.
బొత్స కు పాదాభివందనం చేశారంటూ...
తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వివాదానికి కేంద్రంగా మారారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు పాదాభివందనం చేశారన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. కొండపల్లి శ్రీనివాస్ పై సొంత సోషల్ మీడియాలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ తాను బొత్సకు పాదాభివందనం చేయలేదని కొండపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. అదేసమయంలో ఇటీవల మంత్రి పార్ధసారధి మాజీ మంత్రి జోగి రమేష్ తో కలసి కార్యక్రమంలో పాల్గొన్న సంఘటన కూడా పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. అయితే ఆయన తెలియకుండా పోయారన్న వివరణ ఇచ్చుకున్నారు. ఇలా తొలి మంత్రివర్గంలోనే చంద్రబాబుకు గతంలోఎన్నడూ లేనివిధంగా తొలిసారి ఇబ్బందులుగా తయారయ్యారు.