తిరుమల వెళుతున్నారా... మీకొక గుడ్ న్యూస్

తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది;

Update: 2025-04-11 11:36 GMT
south central railway,  passengers, special trains,  tirumala
  • whatsapp icon

తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలకు వేసవి కాలంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. తిరుపతి - మచిలీపట్నం మధ్య పథ్నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ నెల 13 వతేదీ నుంచి..
ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ తేదీల్లో ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం రైలు, ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.


Tags:    

Similar News