ఏపీ ప్రజలకు చల్లటి కబురు..
మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. దీనిప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో..
రెండురోజుల క్రితం కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. క్రమంగా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో మూడురోజుల్లో ఏపీలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను రుతుపవనాలు తాకనున్నాయని పేర్కొంది.
మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడింది. దీనిప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో బిపోర్ జాయ్ తుపాను తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో మరో నాలుగురోజుల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.