నరసాపురం టిక్కెట్ శ్రీనివాస వర్మకే
నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసవర్మకు ఆ పార్టీ బీఫారాన్ని అందచేసింది
నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసవర్మకు ఆ పార్టీ బీఫారాన్ని అందచేసింది. దీంతో నరసాపురం టిక్కెట్ పై ఉన్న పంచాయతీకి ఇక తెరపడినట్లే అయింది. నరసాపురం టిక్కెట్ ను రఘురామ కృష్ణరాజుకు ఇవ్వాలని టీడీపీ చేసిన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించినట్లయింది. అక్కడి నుంచి శ్రీనివాస వర్మ బరిలోకి దిగుతారని బీఫారం ఇవ్వడంతో స్పష్టమయింది.
ఉండి టిక్కెట్ ను...
ఇప్పుడు రఘురామ కృష్ణరాజుకు ఉండి టిక్కెట్ ను కేటాయిస్తారన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. ఈరోజు టీడీపీ అభ్యర్థులకు కొందరికి బీఫారాలు అందచేసినా ఉండి బీఫారాన్ని ఇంతవరకూ అధినాయకత్వం ఇవ్వకపోవడంతో రఘురామ కృష్ణరాజుకు ఉండి టిక్కెట్ ఇస్తారంటూ ఆ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అయితే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కూడా నామినేషన్ వేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.