Srisailam : శ్రీశైలంలో ఆ మూడు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-12-03 06:23 GMT

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సెలవులు, శని, ఆదిసోమవారాల్లో కూడా స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో ప్రకటించారు. అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతిస్తారు. సామాన్యభక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

స్పర్శదర్శనాలు రద్దు...
ఉదయాస్తమాన, ప్రదోహసాలు, సర్శ దర్శనాలు రద్దు చేస్తూ శ్రీశైలం ఈవో ఆజాద్ నిర్ణయం తీసుకున్నారు. సెలవు దినాలు, సోమవారం నాడు శ్రీశైలంలో భక్తుల రద్దీ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ఈవో ఈనిర్ణయం తీసుకున్నారు. వీఐపీలు కూడా తమకు సహకరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News