Srisailam : కర్ణాటక నుంచి శ్రీశైలానికి భక్తులు ఇలా వస్తూ?

కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో శ్రీశైలం కిక్కిరిసిపోతుంది.;

Update: 2025-03-22 03:29 GMT
crowd, devotees, srisailam, karnataka
  • whatsapp icon

కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో శ్రీశైలం కిక్కిరిసిపోతుంది. ఎక్కువ మంది కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు శివుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఉగాదికి తమ మొక్కులను విభిన్న రీతిలో తీర్చుకునేందుకు కర్ణాటకకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి చేరుకుంటున్నారు. అలా వచ్చిన వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తున్నారు.

కాళ్లకు కర్రలు కట్టుకుని...
వేల కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన పాదయాత్రగా చేస్తూ శ్రీశైలం చేరుకుంటున్నారుర. కర్ణాటకలోని అనేక ప్రాంతాలకు చెందిన భక్తులు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మరీ శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటున్నారు. కాళ్లకు కర్రలు కట్టుకుని వారు పాదయాత్రగా వస్తుండటం చూసి ఆశ్చర్యం కలుగుతుంది. శివనామస్మరణలతో వారు కర్నూలు మీదుగా శ్రీశైలానికి శివలింగాన్ని పల్లకిలో ఉంచి తీసుకెళ్లడం కనిపించింది.


Tags:    

Similar News