జగన్ తో భేటీ కానున్న మంత్రుల కమిటీ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నేడు కొలిక్కి వచ్చే అవకాశముంది. సమ్మె విరమణ అయ్యే ఛాన్స్ ఉంది;
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నేడు కొలిక్కి వచ్చే అవకాశముంది. సమ్మె విరమణ అయ్యే ఛాన్స్ ఉంది. నిన్న మంత్రుల కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన ఉద్యోగ సంఘాలు నేడు మరోసారి భేటీ అయి సమ్మె పై నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా నిన్న సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన సారాంశాన్ని మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు మరికాసేపట్లో వివరించనుంది.
ఉద్యోగ సంఘాల డిమాండ్లు....
మంత్రుల కమిటీ జగన్ తో కాసేపట్లో భేటీ అయి ఉద్యోగులు పెట్టిన డిమాండ్లను వివరించనుంది. నిన్ననే దాదాపు ఉద్యోగ సంఘాల డిమాండ్లలో అత్యధిక భాగం వాటిలో మంత్రుల కమిటీ స్పష్టత ఇచ్చింది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీల పట్ల ఉద్యోగ సంఘాలు కూడా సంతృప్తి చెందినట్లే కనిపిస్తుంది. మరికాసేపట్లో మంత్రుల కమిటీ జగన్ తో సమావేశమై ఉద్యోగుల డిమాండ్లపై కూలంకషంగా చర్చించనుంది.