క్లోరిన్ గ్యాస్ లీకై 10 మంది విద్యార్థులకు అస్వస్థత
స్థానిక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ గ్యాస్ లీకైంది. ఆ సమయంలో పూల్ లో ఉన్న విద్యార్థులంతా..
క్లోరిన్ గ్యాస్ లీకై 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ గ్యాస్ లీకైంది. ఆ సమయంలో పూల్ లో ఉన్న విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 7, బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఉన్నట్టుండి కళ్లు తిరగడం, సొమ్మసిల్లడంతో విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులంతా 8-14 ఏళ్ల వయసులోపు వారని వైద్యులు తెలిపారు. గ్యాస్ లీకైన సమయంలో విద్యార్థులంతా 50–మీటర్ల పూల్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్యాంకర్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11న ఏలూరులో జరగనున్న స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం వీరంతా సిద్ధమవుతున్నారు.