మోదీని కలిసిన ఏపీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీకి చెందిన ఎస్సీ హాస్టల్ కు చెందిన విద్యార్థులు సమావేశమయ్యారు

Update: 2023-03-19 13:13 GMT

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీకి చెందిన ఎస్సీ హాస్టల్ కు చెందిన విద్యార్థులు సమావేశమయ్యారు. వారితో ప్రధాని కాసేపు ముచ్చటించారు. పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీని విద్యార్థులు కలుసుకున్నారు. ఇండియన్ మబ్యాంకు తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభా వింతులైన విద్యార్థులను 42 మందిని ఎంపికచేసి విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లింది. ఇందులో భాగంగా ఢిల్లీ వెళ్లిన విద్యార్థులు ప్రధానిని కలిశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

ఇష్టపడి చదవాలని...
ఈ యాత్రలో రాష్ట్రంలోని వైయస్సార్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభావంతులైన 42 మంది బాల, బాలికలు పాల్గొన్నారని చెప్పారు. ఈ నెల 14 నుంచి 19 దాకా కొనసాగిన ఈ యాత్రలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగానే విద్యార్థులతో కొద్ది సమయాన్ని గడిసిన ప్రధాని వారితో ముచ్చటించారని వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా స్ఫూర్తిని పొందాలని ప్రధాని విద్యార్థులకు ఉద్భోధించారని వివరించారు. పరీక్షల విషయంలో భయాలను విడనాడాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచుకోవాలని మోదీ విద్యార్థులతో అన్నారు.


Tags:    

Similar News