ఏపీ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడు ?

ఇంతవరకూ స్కూల్ విద్యార్థుల వేసవి సెలవులపై క్లారిటీ రాలేదు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్..;

Update: 2023-02-17 12:21 GMT

ap schools summer holidays

తెలంగాణలో 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు మార్చి రెండోవారం నుంచి ఒంటిపూట బడులు, ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. కానీ.. ఏపీలో ఇంతవరకూ స్కూల్ విద్యార్థుల వేసవి సెలవులపై క్లారిటీ రాలేదు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి. ఆ తర్వాతి రెండ్రోజుల్లో పరీక్షల ఫలితాలు, పేరెంట్స్ మీటింగ్ లు నిర్వహించనున్నారు. ఈ ప్రకారం చూస్తే.. ఏప్రిల్ 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారుల ద్వారా అనధికారిక సమాచారం.

వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే.. సెలవులు మరింత ముందు కూడా ఉండొచ్చని తెలుస్తోంది. తిరిగి యథావిధిగా జూన్ 12న స్కూళ్లు పునః ప్రారంభమవ్వనున్నట్లు తెలుస్తోంది. 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకూ జరగనున్నాయి. అనంతరం వారికి సెలవులు ఉంటాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు 10 పరీక్షలు జరగనున్నాయి.




Tags:    

Similar News