Chandrababu : జగన్... ఆస్తిలో చెల్లికి సమాన హక్కు ఇచ్చావా?
రాయలసీమలో అన్ని స్థానాల్లోనూ గెలుపు ఎన్డీఏ కూటమిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
రాయలసీమలో అన్ని స్థానాల్లోనూ గెలుపు ఎన్డీఏ కూటమిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కల్లూరులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. గత ఎన్నికల్లో తమకు మూడు స్థానాలు వచ్చినందుకు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఒక్క స్థానం కూడా రాయలసీమలో వైసీపీకి రాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా భూ హక్కు పత్రాన్ని చంద్రబాబు తగులపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా తేలేదన్నారు. చుక్క నీరు కూడా తేలేని అసమర్థుడు ఈ జగన్ అని మండిపడ్డారు.
ప్రశ్నించిన వారిపై...
ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని భయపడుతున్నారని, ఇక భయపడాల్సిన పనిలేదని, ఈ ప్రభుత్వం పీడ విరగడ అయిందని అన్నారు. జగన్ కనీసం తన తల్లిని కూడా చూడటం లేదని, చెల్లికి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చావా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తనను తాను దేవుడి కంటే గొప్పువాడిగా ఊహించుకుంటున్నారన్నారు. రాజధాని విషయంలోనూ అంతే చేశారని, ప్రజలను పిచ్చోళ్లను చేయడానికి ప్రయత్నించారన్నారు. మూడు రాజధానులంటూ మభ్యపెడుతూ ఎన్నికలలో పబ్బంగడుపుకుందామన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో 190 ప్రాజెక్టుల నిర్మాణాలను నిలుపుదలచేసి సీమ ద్రోహిగా మారారన్నారు.