భువనేశ్వరి దీక్ష ప్రారంభం... ఆమె వెంట ఉన్న నేతలందరూ

రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు

Update: 2023-10-02 06:00 GMT

రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆమె దీక్ష చేపట్టారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉండి 24 రోజులు పూర్తి కావచ్చింది. మరోవైపు నారా లోకేష్ కు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు జరుపుతూ, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని సత్యమేవ జయతే అంటూ నిరాహార దీక్ష చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా...
నారా భువనేశ్వరి వెంట తెలుగు మహిళలంతా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వారంతా సంఘీభావంగా భువనేశ్వరి తో దీక్షకు కూర్చున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఒక రోజు దీక్ష చేపట్టారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని దీక్ష చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు అందరూ నేతలు తమ నియోజకవర్గాల పరిధిలో దీక్షలు చేపట్టి సంఘీభావాన్ని ప్రకటించారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి దీక్ష సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News