TDP : కూటమికి గ్యారంటీగా వచ్చే స్థానాలను చెప్పేసిన రఘురామ కృష్ణరాజు

వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహంతోనే ప్రజలు క్యూ లైన్ లో వేచి ఉండి ఓటేశారని టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు తెలిపారు

Update: 2024-05-20 12:57 GMT

వైఎస్ జగన్ ను ఓడించాలనే కసితోనే ఎంత ఆలస్యమైనా ప్రజలు గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడి ఓట్లు వేశారని టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎవరి మీద అయినా కక్ష ఉంటే వారిపై ఎక్కువ దృష్టి పెడతామా?, కృతజ్ఞతా భావం ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెడతామా? అన్నది ఒక మనిషిగా ఆలోచిస్తే, ఎవరైన కక్ష ఉన్న వారిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. కృతజ్ఞతా భావం ఉన్న వారిని కలిసినప్పుడు మాత్రమే ధన్యవాదాలు చెప్పడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ పై కక్షతోనే ప్రజలు కసిగా ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలివవచ్చి ఓటు వేశారని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అభిమానం ఉంటే వచ్చి ఓటు వేయరని గుర్తు చేశారు.

కసితోనే ఓట్లు వేసి...
ఈవీఎంల ద్వారా ఓటు వేయడానికి ఒక్కొక్కరికి 10 సెకండ్ల కంటే ఎక్కువగానే సమయం తీసుకోవడం జరిగిందన్నారు. పోలింగ్ సమయం సరిపోకపోవడంతో, ఓటర్లు అర్ధరాత్రి వరకు క్యూ లైన్ల లో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. విపరీతమైన ఉక్క పోత ఉన్నప్పటికీ, క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి పై ఎంత కసితో ఉన్నారో అర్థమవుతుందన్నారు . ట్రైన్ మిస్ అవుతుందని తెలిసినా, ఒక రోజు సెలవు పెట్టుకొని మరి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో క్యూలైన్లలో ఓటర్లు నిలబడ్డారన్నారు. పోస్ట్ పోల్ అంచనాల ప్రకారం 150 స్థానాల్లో కూటమి విజయం ఖాయమని తెలిపారు.


Tags:    

Similar News