Breaking : లోకేష్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టివేసింది;

Update: 2023-09-29 05:59 GMT

హైకోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే లోకేష్ కు 41 ఎ నోటీసులు ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. తాము 41 ఎ నోటీసులు ఇస్తామని సీఐడీ తరుపున న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఎ 14 నిందితుడిగా చేర్చింది. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తన యువగళం పాదయాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు. అయితే విచారించిన హైకోర్టు ఈ పిటీషన్ కొట్టివేసింది. దీంతో కాసేపట్లో లోకేష్ కు 41 ఎ కింద నోటీసులు ఇవ్వడానికి సీఐడీ అధికారులు రెడీ అయ్యారు. ఒక బృందం ఢిల్లీకి వెళ్లింది. ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది.


Tags:    

Similar News