Nara Lokesh : వైసీపీ నేతల వరస కేసుల పై నారా లోకేష్ సంచలన కామెంట్స్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీలో తన స్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు;

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీలో తన స్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాన్ క్లేవ్ లో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. భవిష్యత్తులో తన స్థానం ఏంటో నిర్ణయించేది ప్రజలే నన్న నారా లోకేశ్ ప్రస్తుతం తనకు అప్పగించిన శాఖల విధులు అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు. తనకు జీవితంలో ఏదైనా ఛాలెంజ్‌గా తీసుకోవడం అలవాటని, అందుకే చాలా కష్టమైన శాఖ అయినప్పటికీ హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను తీసుకున్నానని నారా లోకేశ్ తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో...
అసెంబ్లీ నియమావళి ప్రకారం ప్రతిపక్ష హోదా పొందాలంటే కనీసం మొత్తం సభ్యులలో 10 శాతం మంది ఎమ్మెల్యేలు ఉండాలని నిబంధన ఉందని, జగన్ ఇది తెలిసీ కూడా ఇప్పుడు హోదా కోసం ఆందోళన చేయడం సమంజసం కాదని అన్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా హోదా కోసం డిమాండ్ చేయడం ఆయనకు ప్రజలపై ఉన్న బాధ్యత ఏంటో అర్థమవుతుందన్న నారా లోకేశ్ గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపై ఇష్టారాజ్యంగా కేసులు పెట్టారని, తన ఒక్కడిపైనే 23 కేసులు పెట్టారని తెలిపారు. తాము తలచుకుంటే జగన్ బయట అంత స్వేచ్ఛగా తిరగగలరా? అని ాయన ప్రశ్నించారు.